
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశించింది. తన యాత్ర సందర్భంగా అదనపు సెక్యూరిటీ కల్పిం చాలని రేవంత్ రెడ్డి కోర్టును కోరారు. అయితే రేవంత్ యాత్ర చుట్టు 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పింది. అయితే అది కేవలం యాత్ర, బందోబస్తు, ట్రాఫిక్ కోసమే ఇస్తున్నారని రేవంత్ తరపు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్ట్..అదనపు భద్రత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నైట్ హాల్ట్ లోనూ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం రేవంత్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది.