సిర్పూర్కర్‌‌ కమిషన్‌‌పై పిటిషన్ వివరాలివ్వండి: హైకోర్టు

సిర్పూర్కర్‌‌  కమిషన్‌‌పై పిటిషన్ వివరాలివ్వండి: హైకోర్టు
  • సిర్పూర్కర్‌‌  కమిషన్‌‌పై పెండింగ్‌‌ పిటిషన్ల వివరాలు ఇవ్వండి
  • దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌  కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
  • విచారణ ఈ నెల 30 కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌  కేసు విచారణలో భాగంగా జస్టిస్‌‌  సిర్పూర్కర్‌‌  కమిషన్‌‌పై సింగిల్‌‌  జడ్జి వద్ద పెండింగ్‌‌లో ఉన్న పిటిషన్ల వివరాలను సమర్పించాలని ప్రతివాదులైన పోలీసులకు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 30 వరకు గడువు విధిస్తూ విచారణను వాయిదా వేసింది.

దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌  కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసులపై కేసు నమోదు చేయాలన్న పిల్‌‌తో పాటు పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌  అలోక్‌‌  అరాధే, జస్టిస్‌‌  జె.శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌లో పాల్గొన్న పోలీసుల తరపున సీనియర్‌‌  న్యాయవాది ఆర్‌‌ఎన్‌‌  హేమేంద్రనాథ్‌‌ రెడ్డి వాదనలు వినిపించారు. 

ప్రీంకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్‌‌  సిర్పూర్కర్‌‌  కమిషన్‌‌ విచారణ జరిపి నివేదిక సమర్పించిందని ఆయన తెలిపారు. జస్టిస్‌‌ సిర్పూర్కర్‌‌  కమిషన్‌‌  నివేదిక చట్టబ ద్ధతను సవాలు చేస్తూ సింగిల్‌‌  జడ్జి వద్ద పిటిషన్లు వేశామన్నారు.  ఒకవేళ సింగిల్‌‌  జడ్జి తమ పిటిషన్లను అనుమతిస్తే.. సిర్పూర్కర్‌‌  కమిషన్‌‌  నివేదిక ప్రశ్నార్థక మవుతుందని, దాని ఆధారంగా ఇక్కడ చేసిన వాదనలకు ప్రయోజనం లేదన్నారు. 

దువల్ల విచారణను వాయిదా వేయాలని కోరగా.. ధర్మాసనం స్పందిస్తూ పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.