
హైదరాబాద్, వెలుగు: సంరక్షణలో ఉన్న బాలిక.. మేజర్ అయ్యాక స్టేట్‌హోంలో నిర్బంధించొద్దని మహిళా శిశు సంక్షేమ శాఖకు హైకోర్టు సూచించింది. యువతి ఇష్టప్రకారం తన అత్తతో వెళ్లేందుకు అనుమతించాలని తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏడేండ్ల కింద ఓ బాలికను ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతో పాటు మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ గృహం సంరక్షణలో ఉంచారు.
ఈ యువతిని అప్పగించాలని కోరుతూ అత్త హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై
జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి బాలికకు 18 ఏండ్లు నిండటంతో నిర్బంధంలో ఉంచుకోవడం చెల్లదని
పేర్కొన్నది. పిటిషనర్‌తో వెళ్లడానికి యువతి అంగీకరించినందున ఆమెను అప్పగించాలని ఆదేశించింది. నెలకోసారి యువతి బాగోగుల గురించి ఆరా తీయాలని శిశు సంక్షేమ శాఖ అధికారులకు హైకోర్టు సూచించింది.