హిల్ ఫోర్ట్ ప్యాలెస్ రిస్టొరేషన్ పై సర్కారుకు హైకోర్టు ఆదేశం

హిల్ ఫోర్ట్ ప్యాలెస్ రిస్టొరేషన్ పై సర్కారుకు హైకోర్టు ఆదేశం

ఇదే చివరి అవకాశమని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ లోని హిల్‌‌ ఫోర్ట్‌‌ ప్యాలెస్‌‌ రిస్టొరేషన్​కు చేపట్టే చర్యల రిపోర్టును రెండు వారాల్లో వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే చివరి అవకాశమని కూడా స్పష్టం చేసింది. విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. మంగళవారం వాదనలు ప్రారంభం కాగానే 8 వారాలు సమయం కావాలని ప్రభుత్వం కోరగా.. హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణను డిసెంబర్‌‌ 6కు వాయిదా వేస్తున్నామని, అప్పుడు జరిగే విచారణకు కూడా నేడు హాజరైన అధికారులే  అటెండ్ కావాలని హైకోర్టు ఆదేశించింది. 

ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డితో కూడిన బెంచ్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. 8 వారాల గడువు కావాలని అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ కోరడంపై బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. గతంలో రూ.50  కోట్లు కేటాయించామని, రిపేర్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ గడువు కోరడం ఏమిటని నిలదీసింది. పిటిషర్‌‌ తరఫున న్యాయవాది ముద్దు విజయ్‌‌ వాదనలు వినిపించారు.