రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

రాష్ట్రంలో సంచలనం  రేపిన సైదాబాద్ ఘటన కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీని​పై విచారణ చేపట్టిన కోర్టు.. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ కు హైకోర్టు ఆదేశించింది. వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ అన్నారు. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ తెలిపారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియా చిత్రీకరణ జరిగిందని చెప్పారు. పోస్టుమార్టం వీడియో షూట్ జరిగినట్లు వివరించారు. వీడియోలు రేపు రాత్రి 8 లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.