కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు ఇవ్వడమేంటి?

కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు ఇవ్వడమేంటి?

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చుల కోసం సీఎస్‌కు రూ. 58కోట్ల మంజూరుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎస్‌కు నిధులు విడుదల చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలపై లెక్చరర్ ప్రభాకర్ వేసిన పిల్‌పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు మంజూరు చేయడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని కోర్టు అడిగింది. రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా సీఎస్ సోమేశ్ కుమార్‌కు వ్యక్తిగత హోదాలో నోటీసిచ్చింది. తదుపరి విచారణను అక్టోబరు 27కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అప్పటి వరకు నిధులు విడుదల చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.