
వలస కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సరిహద్దు దాటించి వదిలేస్తున్నారని హైకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ వసుధ నాగరాజు వలస కార్మికులపై హైకోర్టు లో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేయగా… కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
మేడ్చల్ రహదారిపై మండుటెండలో వందల మంది వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తున్నారని పిటీషనర్ కోర్టుకు తెలుపగా.. వారిని సరిహద్దులు దాటించి ప్రభుత్వం చేతులు దులుపుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారిపై వెళ్తున్న వలస కూలీలను గుర్తించి ఫంక్షన్ హాళ్లకు తరలించాలని ప్రభుత్వానికి ఆదేశమిచ్చింది. వలస కార్మికులు రైలు ఎక్కేవరకూ ప్రభుత్వం భోజనం, వైద్య సేవలు కల్పించాలని తెలిపింది. వారు ప్రత్యేక రైళ్లు, బస్సులకు చేరేలా ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని సూచించింది.
వలస కూలీల కష్టాలు తీరేలా తీసుకున్న చర్యలను ఈనెల 29లోగా తెలపాలని పభుత్వానికి ఆదేశమిచ్చింది హైకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 29 కి వాయిదా వేసింది.