- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(నిథమ్) డైరెక్టర్ ప్రొఫెసర్ వి. వెంకటరమణ నియామకంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేగాకుండా నిథమ్ సంస్థకు, వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్ వెంకటరమణకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. నిథమ్ డైరెక్టర్‌గా నియమితులైన వెంకటరమణకు అర్హతలు లేవని పేర్కొంటూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో206 ను సవాల్ చేస్తూ సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు.
