
రాష్ట్రంలో వీఆర్‌ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. జీవోల జారీకి ముందు ఉన్న యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.