జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులపై హైకోర్టు స్టే

జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులపై హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల అమలును హైకోర్టు నిలిపివేసింది. ప్రతివాదులైన ప్రభుత్వానికి , ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ లకు నోటీసులు ఇచ్చింది. ఫిలిం జర్నలిస్టుల ఫిర్యాదు ఆధారంగా మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నోటీసులను సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ వేణుస్వామి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూరేపల్లి నంద విచారించారు. 

పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొన్నం అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. సినీతారలకు సంబంధించి జాతకాలు చెబుతున్నారంటూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు చేయడం చెల్లదన్నారు. వాదనల తర్వాత కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసుల అమలును నిలిపివేస్తూ స్టే ఆదేశాలు జారీ చేసింది.