కొడిమ్యాల, నాచుపల్లి మధ్య హైలెవెల్ బ్రిడ్జి ప్రారంభం

కొడిమ్యాల, నాచుపల్లి మధ్య హైలెవెల్ బ్రిడ్జి ప్రారంభం

కొడిమ్యాల,వెలుగు: 30 ఏండ్లుగా ఎదురుచూస్తున్న కొడిమ్యాల, నాచుపల్లి గ్రామస్తుల కల నెరవేరిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం ఈ రెండు గ్రామాల మధ్య నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. వేములవాడ నుంచి కొండగట్టు వెళ్లేందుకు కొడిమ్యాల మండలకేంద్రం, నాచుపల్లి మార్గాలు కీలకం. కాగా ఈ రెండు గ్రామాల మధ్య లోలెవెల్ బ్రిడ్జి ఉండడంతో వర్షం వస్తే రాకపోకలు నిలిచిపోయి భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4.30కోట్లతో పనులు ప్రారంభించగా.. బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయి. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే సత్యం చొరవ తీసుకొని బ్రిడ్జి పూర్తిచేయించారు. బుధవారం బ్రిడ్జి పైనుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో కొడిమ్యాల ప్యాక్స్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజనర్సింగరావు, చొప్పదండి ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పిడుగు ప్రభాకర్ రెడ్డి, లీడర్లు స్వర్ణలత, ముత్యం శంకర్, నారాయణ, ఆర్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవో స్వరూప, సీఐ రవి పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భర్తకు ఎమ్మెల్యే పరామర్శ 

గంగాధర/ మల్యాల, వెలుగు: గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి రెండు రోజుల కింద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సర్కారులో గ్రామభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేశారని, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

రవి చికిత్సకయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. లీడర్లు ఉప్పుల అంజనీప్రసాద్​, పురుమల్ల మనోహర్, గునుకొండ బాబు, పాల్గొన్నారు. మల్యాల మండలం నూకపెల్లికి చెందిన బీజేపీ లీడర్​సురేశ్​ ఆధ్వర్యంలో 20 మంది, రామన్నపేటకు చెందిన ఓ మహిళ(మైనారిటీ నాయకురాలు) కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు.