హై – ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్.. చనాదోశ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..!

హై – ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్.. చనాదోశ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..!

ఇవాళ రేపు ఏదైనా తినమని ఇస్తే డైట్.. డైట్ అంటున్నారు. డైట్​ అంటే ఏం తింటారో అనుకునేరుపోషకాలు పుష్కలంగా ఉండే ఇంగ్రెడియెంట్స్​తో తయారైన ఆహారమే. అందులోనూ జిమ్​కెళ్లేవాళ్లుప్రొటీన్ ఉండే ఫుడ్​కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సో, క్యాలరీలను ఖర్చు చేసుకోవాలని జిమ్​లో కష్టపడేవాళ్లు, హెల్దీ డైట్​తో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవాళ్లు..అంతెందుకు, పొద్దున్నే హెల్దీగా డే స్టార్ట్ చేయాలనుకునేవాళ్లూ చనాదోశ ను ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.   ఇప్పుడు ఆ వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. . .! 

చనా దోశ తయారీకి  కావాల్సినవి  

  • శనగలు, బొంబాయి రవ్వ: అర కప్పు 
  • ఉప్పు: సరిపడా
  •  అల్లం: చిన్న ముక్క
  • పచ్చిమిర్చి: రెండు
  • వెల్లుల్లి రెబ్బలు: ఐదు
  • జీలకర్ర: ఒక టీస్పూన్
  • కొత్తిమీర, కరివేపాకు: కొంచెం
  • పెరుగు: పావు కప్పు
  • నీళ్లు: ఒక కప్పు

చనా దోశ తయారీ విధానం

శనగల్ని కడిగి రాత్రంతా నానబెట్టాలి. దోశ పిండి తయారీ కోసం శనగల్ని మిక్సీలో వేసి వాటితోపాటు అల్లం, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, బొంబాయి రవ్వ, కరివేపాకు, పెరుగు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. 

ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, మూతపెట్టి ఇరవై నిమిషాలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పాన్​ వేడి చేసి దోశ పిండి వేసి దోరగా కాల్చాలి. 

అంతే చనా దోశ రడీ.. సూపర్​ టేస్టీగా ఉంటుంది. ఇది మంచి బలం కూడా.. దీనిని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.