
హైదరాబాద్, వెలుగు: శుక్రవారం నుంచి నామినేషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసుల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు గ్రేటర్‌లోని అన్ని రిటర్నింగ్‌ఆఫీసుల వద్ద నాలుగు అంచెల భద్రత కల్పిస్తున్నారు.
రిటర్నింగ్ ఆఫీసు లోపల సెంట్రల్ ఫోర్సెస్, స్థానిక పోలీసులను నియమిస్తున్నారు. ఆర్వో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో నవంబర్ 3 నుంచి 15వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తూ మూడు కమిషనరేట్ల సీపీలు ఇప్పటికే నోటిఫికేషన్స్ విడుదల చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఏసీపీ స్థాయి అధికారిని ఆర్‌ఓ ఆఫీస్‌ల వద్ద నోడల్ ఆఫీసర్‌గా నియమించనున్నారు.