జల జగడం..సాగర్ వద్ద భారీ బందోబస్తు

జల జగడం..సాగర్ వద్ద భారీ బందోబస్తు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర మూడో రోజు పోలీసుల పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోనికి జెన్ కో సిబ్బందికి తప్ప ఎవర్నీ అనుమతిoచటంలేదు తెలంగాణ పోలీసులు. గట్టి భద్రత నడుమ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్ జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లలో 660 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తున్నారు జెన్కో అధికారులు. ఏపీ-తెలంగాణ బార్డర్ లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు గేట్ దగ్గర ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.