ఫాంహౌస్ కేసులో ఫోన్ డేటా ఆధారంగా కొనసాగుతున్న దర్యాప్తు

ఫాంహౌస్ కేసులో ఫోన్ డేటా ఆధారంగా కొనసాగుతున్న దర్యాప్తు

శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు పెంచారు. గేటుకు తాళం వేసిన పోలీసులు లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో అరెస్టు చేసిన స్వామీజీతో పాటు మరో ఇద్దర్ని అక్కడే ప్రశ్నిస్తున్నారు. ముగ్గురి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరితో టచ్ లోఉన్నారన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నందు అనే వ్యక్తి పొలిటికల్ లీడర్లతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఫాం హౌస్ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురిని పోలీసులు మరికాసేపట్లో రాజేంద్ర నగర్ ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసులు వారి రిమాండ్ రిపోర్టును రెడీ చేస్తున్నారు. 

మరోవైపు అజీజ్ నగర్ ఫాం హౌస్లో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మరోసారి తనిఖీలు చేశారు. ఇదిలా ఉంటే నిన్న డబ్బులున్నట్లు చెబుతున్న బ్యాగుల్లో ఏమీ దొరకలేదని ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా ఆ డబ్బు సంచుల్ని ఓపెన్ చేసి చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు ఈ రోజు మరోసారి ఫాంహౌజ్ లో తనిఖీలు నిర్వహించారు. మొయినాబాద్ ఫాంహౌజ్ లోపలికి ఎవర్నీ అనుమతించడం లేదు.