
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించే శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 16 వేలమంది పోలీసులతో పాటు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్ర సీతారాం బాగ్ నుంచి ప్రారంభమై హనుమాన్ వ్యాయమ శాల వరకు సాగుతుందని చెప్పారు.
మధ్యాహ్నం 2 గంటలకు నుంచి సాయంత్రం వరకు శోభాయాత్ర జరుగుతుందని, యాత్ర జరిగే ప్రాంతాల్లో 192 కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ కి అటాచ్ చేసి పర్యవేక్షిస్తామని తెలిపారు.4 ప్రత్యేక కెమేరాలతో 360 డిగ్రీస్ టెక్నాలజీ తో లైవ్ లో యాత్రను వీక్షిస్తామని ఆయన అన్నారు. సమస్యత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని అంజనీ కుమార్ తెలిపారు