శ్రీరామ నవమి శోభాయాత్ర.. ఓల్డ్ సిటీలో హై సెక్యూరిటీ.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరింపు

శ్రీరామ నవమి శోభాయాత్ర.. ఓల్డ్ సిటీలో హై సెక్యూరిటీ.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరింపు

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓల్డ్ సిటీ సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు సాగే శోభాయత్రపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ముఖ్యంగా ఓల్డ్ సిటీలో సెక్యూరిటీ టైట్ చేశారు. అటు శ్రీరామ నవమి సందర్భంగా 2026 మార్చి 27న హిదువులు భారీ ఎత్తున శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు శుక్రవారం కావడంతో ముస్లింలు ప్రార్థనలకు వెళ్లే చాన్స్ ఉంది. ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఓల్డ్ సిటీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. 

 చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాలలో టీఎస్ఎస్ స్పీ, శాంతిభద్రతల శాఖ,రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు పోలీసులు. సీతారాంబాగ్ నుండి కోటి హనుమాన్ హనుమాన్ వ్యయమశాల వరకు సాగే శోభాయాత్రకు 3 వేలకు పైగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రామనవమి సందర్భంగా సిటీలో 339 ప్రాంతాల్లో వేడుకలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిటీలో ముఖ్యంగా 4 శోభాయాత్రలను మెయిన్ ప్రొసీషన్ గా పరిగణిస్తున్నారు పోలీసులు. ఇందులో మెయిన్ ఫోకస్ సీతారాంబాగ్–కోటీ యాత్రపైనే పెట్టారు. అనుకున్న సమయానికి శోభాయత్ర పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.