శబరిమలలో హైటెన్షన్.. తెలుగు భక్తుడి తల పగలగొట్టిన స్థానిక వ్యాపారి.. అయ్యప్ప మాలధారుల భారీనిరసన

శబరిమలలో హైటెన్షన్.. తెలుగు భక్తుడి తల పగలగొట్టిన స్థానిక వ్యాపారి..  అయ్యప్ప మాలధారుల భారీనిరసన

శబరిమలలో హైటెన్షన్ నెలకొంది. తెలురు రాష్ట్రానికి చెందిన భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు.  వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు షాపు యజమాని.. గాజు సీసాతో ఓ అయ్యప్ప మాలధారుడి తల పగలగొట్టాడు. 

హైదరాబాద్ నగరానికి చెందిన ఒక భక్తుడి మాలను వ్యాపారి తెంపేసినట్లు తెలుస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూషాపు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఏపీ, తెలంగాణకు చెందిన భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగిలిన షాపుల యజమానులు కూడా భక్తు లపై ఎదురు తిరగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ALSO READ : ఇండిగో సంక్షోభంతో దిగొచ్చిన DGCA..

ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయ త్నంచేశారు. అయితే పోలీసులు కూడా వ్యాపారులకే సపోర్టుగా ఉన్నారంటూ తెలుగు భక్తులు భారీ నిసరన తెలుపుతున్నారు.