Varanasi: కాశీ సెట్ లో మహేష్ బాబు..వారణాసి భారీ యాక్షన్ సీక్వెన్స్

Varanasi: కాశీ సెట్ లో మహేష్ బాబు..వారణాసి భారీ యాక్షన్ సీక్వెన్స్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’.  ప్రియాంక చోప్రా హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  శ్రీ దుర్గా ఆర్ట్స్,  షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  

ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన మేకర్స్.. నెక్స్ట్  షెడ్యూల్‌‌‌‌ను కాశీలో ప్లాన్ చేశారట. అక్కడి  రియల్ లొకేషన్స్‌‌‌‌లో కీలక సీన్స్‌‌‌‌ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే  ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌ను కూడా చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్‌‌‌‌తో మేజర్ టాకీ పార్ట్ పూర్తికానుందని, మిగతా భాగాన్ని  అంటార్కటికా, వియత్నాం, థాయ్‌‌‌‌లాండ్ లాంటి  ప్రదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  వచ్చే ఏడాది  సమ్మర్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌గా  ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన  టైటిల్ గ్లింప్స్‌‌‌‌తోనే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.