రాష్ట్రంలో జీరో అడ్మిషన్లవుతున్న కాలేజీల మూసివేత

రాష్ట్రంలో జీరో అడ్మిషన్లవుతున్న కాలేజీల మూసివేత

రాష్ట్రంలో జీరో అడ్మిషన్లు అవుతున్న కాలేజీలను ఉన్నత విద్యామండలి అధికారులు మూసివేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మూసివేతకు రంగం సిద్ధం చేశారు. 20 నుంచి 50 వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను కూడా మూసివేసేందుకు సిద్ధమవుతున్నారు. సగానికిపైగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో సౌకర్యాలే లేవు. కేవలం రూసా నిధుల మీద ఆధారపడి కాలేజీలు నడుస్తున్నాయంటున్నారు లెక్చరర్లు. డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం లేదంటున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందన్నారు. 4వేల మంది రెగ్యులర్ లెక్చరర్లకు గాను 1250 మందే ఉన్నారని చెబుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను మూసివేస్తే ఊరుకోబోమని డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు హెచ్చరిస్తున్నారు. జీరో అడ్మిషన్లు ఉన్న కోర్సులు, కాలేజీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం..

98 ఏళ్ల ఈ బామ్మ ఎందరికో ఆదర్శం

ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు తేలికపాటి వర్షాలు