స్కిల్ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టాలి : ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి 

స్కిల్ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టాలి : ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి 
  • ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కొత్త డిగ్రీ కోర్సులు
  • యూనివర్సిటీల వీసీలతో చర్చించి రూపొందించినట్టు వెల్లడి
  • కొత్త కోర్సులపై గురుకుల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లకు ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే అకడమిక్ ఇయర్​ నుంచి కొత్తగా ప్రవేశ పెడుతున్న డిగ్రీ కోర్సులు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉన్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్  బాలకిష్టారెడ్డి అన్నారు. ఆయా కోర్సులను ఆరు యూనివర్సిటీలు, వివిధ రంగాల నిపుణులతో విసృతంగా చర్చించి రూపొందించినట్టు చెప్పారు. బుధవారం మాసబ్​ట్యాంక్​ డీఎస్ ఎస్ భవన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల ప్రిన్సిపల్స్ కు కొత్త డిగ్రీ కోర్సులపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నిరంతరం స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిగ్రీలో కొత్త కోర్సులు విద్యార్థుల ఉపాధి అవకాశాలు పెంచేలా ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా బోధించాలన్నారు. కాలేజీలకు పాఠ్యపుస్తకాలు, నిపుణుల సేవలు, అలాగే ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం కంపెనీలతో ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకునేందుకు జాబితా అందిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కోర్సుల రూపకల్పనలో టెక్నాలజీ, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్షిప్, న్యాయ అంశాలు, పరిశోధన/ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ అనే నాలుగు ముఖ్య భాగాలను సమన్వయం చేసినట్లు వివరించారు.

మారిటైం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేయడం ప్రిన్సిపల్స్ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రెసిడెన్సియల్ ఇనిస్టిట్యూషన్స్ లో ఇటువంటి కార్యక్రమాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని తెలిపారు. ఇంటరాక్టివ్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రిన్సిపల్స్, లెక్చరర్ల సందేహాలకు మండలి చైర్మన్​ సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ గురుకులాల అకడమిక్ కో ఆర్డినేటర్ సుచిత్ర, ఎస్సీ గురుకుల జాయింట్ సెక్రటరీ శర్మ, మూడు గురుకులాల నుంచి లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.