
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ముంగేశ్పూర్ ఏరియాలో బుధవారం ఏకంగా 52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ముంగేశ్పూర్ ప్రాంతంలో 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయినట్టు వివరించారు.
- ఇప్పటి వరకు భూమ్మీద రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీలు.. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో 1913 జులై 10 న రికార్డైంది.
- భారత దేశంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీలు.. ఢిల్లీలో బుధవారం 2024 మే 29న నమోదైంది.
- రాజస్థాన్లోని ఫలోడిలో 2016 లో 51 డిగ్రీలు
- రాజస్థాన్లోని చురూలో2019లో 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత, 1956లో 50.6 డిగ్రీలు, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు నమోదైంది.