కేఆర్ఎంబీ తీర్మానంలోని ముఖ్యాంశాలివీ..

కేఆర్ఎంబీ తీర్మానంలోని ముఖ్యాంశాలివీ..
  •      పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, బేసిన్​లోని జనాభా, ఆయకట్టును ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ, ఏపీల మధ్య నీటి పంపకాలు చేయాలి.
  •     కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ–1) అవార్డ్​ ప్రకారం.. బేసిన్ ​అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వాటాలు కేటాయించాలి. 
  •     నాగార్జునసాగర్​ ప్రాజెక్టుకు 264 టీఎంసీల నీటిని తరలించే ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టును కట్టారు. ప్లానింగ్​కమిషన్​సూచనల మేరకు దాన్ని 1962లో జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా నిర్మించారు. ఆ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే కనీస నీటిమట్టాన్ని 830 అడుగులుగా కేడబ్ల్యూడీటీ–1 నిర్ధారించింది. దానికి కట్టుబడి ఉండాలి. 
  •     సెంట్రల్​వాటర్​కమిషన్​ఆదేశాలకు అనుగుణంగా చెన్నై తాగు నీటి అవసరాల కోసం 15 టీఎంసీలు, ఎస్ఆర్​బీసీకి 19 టీఎంసీలుగా లిమిట్​ పెట్టాలి.  
  •     కేడబ్ల్యూడీటీ–1 అవార్డు ప్రకారం తాగునీటి కోసం విడుదల చేసే నీళ్లలో కేవలం 20 శాతం నీటినే వాడుకున్నట్టుగా పరిగణించాలి. 
  •     కేడబ్ల్యూడీటీ–1 అవార్డు ప్రకారం రాష్ట్రానికి ఉన్న నీటి వాటాలో ఏటా వాడుకున్నంక.. మిగిలిన నీటిని వచ్చే ఏడాది వాడుకునేలా అనుమతించాలి. అలా వాడుకున్న నీళ్లను ఆ ఏడాది వాడుకున్న నీటి లెక్కల్లో కలపకూడదు.  
  •     కేంద్ర జలశక్తి శాఖ, సెంట్రల్​వాటర్​కమిషన్​అనుమతి లేకుండా బేసిన్​ అవతలకు (నది పరీవాహక ప్రాంతం కాని ఏరియాలు) నీటిని తరలించే అనధికారిక ప్రాజెక్టులు, ప్రాజెక్టుల విస్తరణ, కొత్త కాంపోనెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దు.