ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరిచిన్రు

ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరిచిన్రు

అడ్డగూడూరు: కేసీఆర్, కేంద్రం దొందూ దొందేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వైఎస్సార్టీపీ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర 36వ రోజుకు చేరుకుంది. అడ్డగూడూరు మండలం రేపాక చేరుకున్న షర్మిల అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ... కేసీఆర్ కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై ఆర్ధిక భారాన్ని మోపారన్నారు. పైగా ధరల పెంపు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం విమర్శించుకుంటూ ధర్నాకు దిగడం విడ్డూరమన్నారు. ఇదంతా డ్రామా అని కొట్టిపారేశారు. 

తమ పోరాటం వల్లే  80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పారని అన్నారు. కానీ కేసీఆర్ ఉద్యోగాల హామీని ప్రకటన వరకే  పరిమితం చేశారని, అందుకే నోటిఫికేషన్లు వేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా చేయని పనిని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లలో చేశారన్నారు. వైఎస్సార్ మూడు నోటిఫికేష్లను వేశారని, ప్రైవేట్ రంగంలో కూడా 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పోరేషన్ల ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. రాజశేఖర్ రెడ్డి 46 లక్షల ఇళ్లు కట్టించారని, కనీసం 4 లక్షల ఇళ్లైనా కట్టించారా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. రానున్నది రాజన్న రాజ్యమని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని షర్మిల అన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న బైడెన్

ఉక్రెయిన్‌లో థియేటర్పై మిస్సైల్ దాడి.. 300 మంది మృతి