రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న బైడెన్

రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న బైడెన్

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్  ఐరోపాలో పర్యటిస్తున్నారు. గురువారం బెల్జియం రాజధాని బ్రస్సేల్స్ లో నాటో, జీ-7 సమ్మిట్లు, ఐరోపా సమాఖ్య నాయకులతో భేటీలో పాల్గొన్నారు బైడెన్. రష్యాకు కీలక ఆదాయ మార్గమైన చమురును ఆయా దేశాలు కొనుగోలు చేయడాన్ని క్రమంగా తగ్గించాలని నిర్ణయించారు బైడెన్. రష్యా పార్లమెంట్ సభ్యులు సహా.. పారిశ్రామికవేత్తలు, 48 డిఫెన్స్  కంపెనీలు.. ఇలా మొత్తం 400 మంది వ్యక్తులు, సంస్థలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు బైడెన్ ఆంక్షలను ఖండించిన రష్యా... గురువారం తమ దేశంలోని పలువురు అమెరికా రాయబారులను దేశం నుంచి వెలివేసింది.

బెల్జియం పర్యటనను ముగించుకున్న బైడెన్.. నేరుగా పోలాండ్ బయలుదేరి వెళ్లనున్నారు. నాటోలో సభ్యత్వం ఉన్న దేశం పోలాండ్.... ఉక్రెయిన్ తో సరిహద్దులు పంచుకుంటుంది. రష్యాపై కఠిన ఆంక్షలను సైతం విధించింది పోలాండ్. నాటో అత్యవసర సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బైడెన్.. పోలాండ్ లో పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలాండ్ రాజధాని వార్సాకు బదులుగా ఆర్జెస్జో సిటీలో మకాం వేయనున్నారు బైడెన్. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే ఉండే ఆర్జెస్జ సిటీలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ తో రష్యాను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు బైడెన్.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్న టైమ్ లో పోలాండ్ లో బైడన్ మీటింగ్ ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఉక్రెయిన్ సాగిస్తోన్న యుద్ధాన్ని బైడెన్ స్వయంగా పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ సైన్యానికి బైడెన్ దిశా నిర్దేశం చేస్తారని సమాచారం. ఉక్రెయిన్ పై యుద్ధం మరింత కాలం పాటు కొనసాగాల్సి వస్తే.. న్యూక్లియర్ ఆయుధాలను వాడే ఛాన్స్ ఉందన్న విషయాన్ని రష్యా తోసిపుచ్చట్లేదు. రసాయనిక, జీవాయుధాలను ప్రయోగించడంలో వెనుకాడబోమనే సందేశాన్ని ఇదివరకే ఇచ్చింది రష్యా. యుద్ధంలో అమెరికా జోక్యం మితిమీరిందంటూ క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. ఇది ఇలాగే కొనసాగితే- అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది రష్యా.

మరిన్ని వార్తల కోసం

ఉక్రెయిన్‌లో థియేటర్పై మిస్సైల్ దాడి.. 300 మంది మృతి

టెట్ సిలబస్, గైడ్‎లైన్స్‎ ప్రకటించిన విద్యాశాఖ