ఆంధ్రాకు లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది

ఆంధ్రాకు లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది

తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జాలేస్తోందని ఆయన అన్నారు.

‘బాయిల్డ్ రైస్ విషయంలో ఆంధ్రాకు లేని ఇబ్బంది తెలంగాణకు మాత్రం ఎందుకు వచ్చింది. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రానిది మొదటినుంచి ఒకే మాట. ఇచ్చిన టార్గెట్ కూడా తెలంగాణ పూర్తి చేయలేదు. ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ తయారుచేయడు. బాయిల్డ్ రైస్ ఇవ్వం అని రాసిచ్చినప్పుడు ఇంగితం లేదా? కరోనా టైంలో అన్ని రాష్ట్రాలు పెట్రోల్ రేట్లు తగ్గించాయి.. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. మీ కుటుంబ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలను బలి చేయొద్దు. కేంద్రం ఇచ్చిన శాంక్షన్లకు ఇప్పటివరకు అతీగతీ లేదు. వడ్ల ఎగమతిలో ఇతర రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుంది. తప్పుడు ప్రచారం చేయడానికి టీఆర్ఎస్ నేతలకు నోరెలా వస్తుంది. రైతుల గురించి మీకు బాధ్యత లేదా? అసలు ఇంతవరకు ఎంత పంట సాగయిందో కూడా చెప్పలేదు. దేశానికో చట్టం.. తెలంగాణకో చట్టం ఉండదు. కానీ కేసీఆర్ మాత్రం సిద్ధిపేటకో చట్టం.. దుబ్బాకకో చట్టం అమలుచేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రులకు టార్గెట్ ఇచ్చి మరీ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు. తండ్రి, కొడుకు, కూతురు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారు.. సమయం వచ్చినప్పుడు వారి చతురతను ప్రదర్శిస్తారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.

For More News..

టెట్ సిలబస్, గైడ్‎లైన్స్‎ ప్రకటించిన విద్యాశాఖ

‘ఆర్ఆర్ఆర్’ చూస్తూ అభిమాని మృతి

పీయూష్ గోయల్‎కు ఎర్రబెల్లి సవాల్

ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 2