
హైదరాబాద్, వెలుగు: సర్కారు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా హిమబిందు, శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సోమవారం నాంపల్లిలో జరిగిన ప్రిన్సిపల్స్ సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వడ్లూరి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా నికత్ అంజు, జోనల్ సెక్రటరీలుగా లక్ష్మీనర్సయ్య, సునీత, పద్మావతి, ఈసీ మెంబర్ గా జకీరుల్లా, ఎక్సఫీషియల్ మెంబర్ గా సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా రచ్చ శ్రీనివాస్
అలాగే.. స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంఘటన కార్యదర్శిగా రచ్చ శ్రీనివాస్ నియమితులయ్యారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జాతీయ కార్యసమితి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో రచ్చ శ్రీనివాస్‌ను పేరును ప్రకటించారు.