ఇంట్లో పార్టీపై..వీడియో రిలీజ్ చేసిన హిమజ

ఇంట్లో పార్టీపై..వీడియో రిలీజ్ చేసిన హిమజ

బిగ్ బాస్ ఫేమ్ హిమజపై పోలీసులు కేసు నమోదు చేశారంటూ వస్తోన్న ఈ వార్తలపై హిమజ స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇంట్లో..ఎలాంటి రేవ్ పార్టీ జరగలేదని, దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానని..ఎవరు, ఎందుకు ఇలాంటి కంప్లైట్ చేశారో తనకు తెలియదంది. ఎన్నికల కోడ్ ఉన్నందున ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటికి వచ్చి చెక్ చేసుకుని వెళ్లారని తెలిపింది. దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రేడ్ చేయోద్దని కోరింది.  

ఇలా రూమర్లు క్రియేట్ చేయడంతో ఫ్యామిలీలో అందరూ ఆందోళన చెందుతున్నారు..ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి..నా గురించి అందరూ ఆరా తీస్తున్నారు.. అందుకే అందరికీ ఇలా క్లారిటీ ఇస్తున్నాను..ఇంట్లోనే ఉన్నాను..ఆ వార్తలన్నీ అవాస్తవం..ఇలాంటి రూమర్లు వారంతా ఎందుకు క్రియేట్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు.. అలాంటి వాళ్ల గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అన్నట్టుగా హిజమ ఇన్స్టా వీడియోలో చెప్పుకొచ్చారు.

అంతకుముందు ఇబ్రహీంపట్నం పోలీసులు హిమజపై కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.  తన ఇంట్లో దీపావళి పార్టీ ఇస్తున్న క్రమంలో..తన తోటి బిగ్ బాస్ నటులు, నటీమణులను పిలిచి రేవ్ పార్టీ ఇచ్చిందని, ఈ పార్టీలో మందుతోపాటు, భారీ ఎత్తున సౌండ్ పెట్టి గంతులు వేస్తున్నారని స్థానికులు కంప్లయింట్ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హిమజ ఆ వార్తలకు చెక్ పెడుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Himaja? (@itshimaja)