మైనస్ 20 డిగ్రీల చలిలో జవాన్ల పహారా

మైనస్ 20 డిగ్రీల చలిలో జవాన్ల పహారా

దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీర జవాన్లు పహారా కాస్తున్నారు. సరిహద్దుల్లో శత్రువులు, ఉగ్రవాదులతోనే కాకుండా ప్రతికూల వాతావరణంతోనూ నిరంతరం పోరాడుతున్నారు. మైనస్ డిగ్రీల చలిలో, శరీరం గడ్డ కట్టుకుపోయేంతలా ఉన్న మంచులో పట్టుసడలని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. మన రక్షణ కోసం ఆ సైనికులు పడుతున్న కష్టం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి.

హిమాచల్ ప్రదేశ్ లో 14 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్లు సరిహద్దులో పహారా కాస్తున్న దృశ్యాలను ఐటీబీపీ విడుదల చేసింది. ఐటీబీపీలోని ‘హిమవీర్’ సైనికులు మైనస్ 20 డిగ్రీల చలిలో, మంచు వర్షం మధ్య ముందుకు సాగుతున్నారు. ఆ భారీ హిమపాతంలో అడుగు తీసి అడుగు వేయడానికి పడుతున్న కష్టం చూస్తే ఈ వీరుల సాహసానికి సెల్యూట్ చేయకుండా ఉండలేమనిపిస్తుంది.

మరిన్ని వార్తల కోసం..

పిల్లలకు పోలియో చుక్కలు వేసిన సీఎం

ఉక్రెయిన్‌కు అండగా ముందుకొస్తున్న దేశాలు

యూపీలో అనురాగ్ ఠాకూర్ వినూత్న ప్రచారం