హిందీ బలోపేతానికి సహకరించండి: కేంద్ర మంత్రిని కోరిన హిందీ ప్రచార సభ

హిందీ బలోపేతానికి సహకరించండి: కేంద్ర మంత్రిని కోరిన హిందీ ప్రచార సభ

బషీర్​బాగ్, వెలుగు: దక్షిణ భారతదేశంలో హిందీ భాషాభివృద్ధికి సహకరించాలని హిందీ ప్రచార సభ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్.గైబువల్లి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన తన బృందంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును పార్లమెంట్ భవనంలోని ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో హిందీ బోధకులను ఏర్పాటు చేయాలన్నారు. 

హిందీ ప్రచారసభ హైదరాబాద్ ద్వారా వెలువడుతోన్న ‘వివరణ్’ పత్రిక వచ్చే నెలలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనుందన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ ప్రచార సభ ప్రతినిధులు జె.వెంకటరామ్ నరసింహా రెడ్డి, రఘువీర్ శర్మ, భావన సక్సేన, ఏపీ హిందీ ప్రచార సభ ప్రతినిధులు కోనే శ్రీధర్, రవిప్రసాద్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.