ఏక్తా యాత్ర ప్రారంభం..భారీ సంఖ్యలో హాజరైన హిందువులు

 ఏక్తా యాత్ర ప్రారంభం..భారీ సంఖ్యలో  హాజరైన హిందువులు

హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది.  ఏక్తా యాత్రతో కరీంనగర్ పట్టణం కాషాయమయమైంది. నగరంలోని మెయిన్ సెంటర్లలో కాషాయ జెండాలు, భారీ హనుమాన్ కటౌట్లను ఏర్పాటు చేశారు. హిందూ ఏక్తా యాత్రకు భారీ సంఖ్యలో హిందువులు హాజరయ్యారు. 

పదేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి రోజున హిందూ ఏక్తా యాత్ర పేరిట నిర్వహిస్తున్నారు. హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నామని బండి సంజయ్‌ పేర్కొన్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పాల్గొంటున్నారు.  యాత్ర రథంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు ఎంపీ బండి సంజయ్ నిలబడనున్నారు. మరోవైపు ఏక్తా యాత్రకు  సీపీ సుబ్బారాయుడు పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.