యాంకర్ నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు.. ఎవరీ బారిల్ వన్నెహసాంగి?

యాంకర్ నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు.. ఎవరీ బారిల్ వన్నెహసాంగి?

 మిజోరాం అసెంబ్లీలో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా ఓ మహిళ స్పీకర్ గా  నియమితులయ్యారు. ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగి స్పీకర్ గా ఎంపికయ్యారు. 33 ఏళ్ల వన్నెహసాంగి తొలుత టీవీ యాంకర్ గా  పనిచేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ గా మారారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐజాల్ సౌత్ 3 నుంచి  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  

ALSO READ :- డీఎస్సీ అభ్యర్థులకు 2 నెలలు ఫ్రీ కోచింగ్

మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఆమె  చరిత్ర సృష్టించారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పనిచేశారు. అంతకుముందు ఆమె యాంకర్ గా పనిచేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.