డీఎస్సీ అభ్యర్థులకు 2 నెలలు ఫ్రీ కోచింగ్

డీఎస్సీ అభ్యర్థులకు 2 నెలలు ఫ్రీ కోచింగ్

హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎస్సీ స్డడీ సర్కిల్‌ అధికారులు శనివారం (మార్చి 9) డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణాలో తాజాగా వెలువడిన మెగా డిఎస్సీ అప్లై చేసుకున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు ఉచితంగా రెండు నెలలు శిక్షణ ఇవ్వనుంది. దీని కోసం జిల్లా కేంద్రాలతోపాటు గవర్నమెంట్ డైట్, బీఈడీ కాలేజీలను ఎంపిక చేశారు. మొత్తం 16 సెంటర్లలో సెంటర్ కు 100 మందిని చొప్పున సెలక్ట్ చేయనున్నారు. అప్లికేషన్ వివరాలు ఎస్సీ స్టడీ సర్కిల్‌ అధికారిక వెబ్ సైట్ లో మార్చి నుంచి అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

ALSO READ :- పాకిస్థాన్​ 14వ అధ్యక్షుడిగా అసీఫ్ అలీ జర్దారీ

ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 12 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు DIET లేదా TET క్వాలీఫై అయ్యి ఉండాలి.   శిక్షణ కాలం: 2024 ఏప్రిల్15న కోచింగ్ ప్రారంభమై 2024 జూన్ 14 వరకూ రెండు నెలలు ఉంటుంది. ఆన్ లైన్ లో studycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రీ కోచింగ్ పొందడానికి ఎంట్రన్స్ ఎగ్జా్మ్ పెట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.