సేమ్ టూ సేమ్.. అప్పట్లో కేజ్రీవాల్.. ఇప్పుడు విజయ్.. ఓట్లు, సీట్లు, మద్దతు అలాగే.. 2013 హిస్టరీ 2026లో రిపీట్ అయ్యిందా..?

సేమ్ టూ సేమ్.. అప్పట్లో కేజ్రీవాల్.. ఇప్పుడు విజయ్.. ఓట్లు, సీట్లు, మద్దతు అలాగే.. 2013 హిస్టరీ 2026లో రిపీట్ అయ్యిందా..?

కొత్త చరిత్ర పాత చరిత్రను తవ్వి తీస్తుంది అంటారు.. ఇప్పుడు ఇదే నిజం అనిపిస్తోంది. 2013లో కేజ్రీవాల్ రూపంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రాజకీయ విప్లవం.. ఇప్పుడు సేమ్ టూ సేమ్ అలాగే 2026లో తమిళనాడులో విజయ్ కు జరిగింది. ఓట్లు, సీట్లు, మద్దతు ఇలాగే ఉండటంతో.. సోషల్ మీడియాలో అంతా ఇప్పుడు ఇదే డిస్కషన్ నడుస్తుంది. 

అప్పుడు ఆప్ పార్టీ : 
2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 28 సీట్లు గెలుచుకున్నది. అతి పెద్ద పార్టీ ఆప్. ప్రభుత్వ మద్దతుకు 8 సీట్లు అవసరం ఏర్పడింది. 

ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ :
2026లో తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ సొంతంగా పోటీ చేసి 108 సీట్లు గెలిచారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118కు.. 10 సీట్ల తక్కువలో ఉన్నారు. 

సీఎంల ఓటమి విషయంలోనూ..
కేజ్రీవాల్ ఆప్ తరపున అప్పటి కాంగ్రెస్ సీఎం షీలా దీక్షిత్.. అప్పటికే ఆమె మూడు సార్లు సీఎంగా ఉన్నారు. ఆమెపై పోటీ చేశారు కేజ్రీవాల్. సిట్టింగ్ సీఎంగా షీలా దీక్షిత్ ఓడిపోయారు. 

ఇప్పుడు తమిళనాడులోనూ సేమ్ సీన్ రిపీట్. సిట్టింగ్ సీఎం స్టాలిన్ ను.. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ఓడించారు. ఆప్, టీవీకే పార్టీలు అరంగేట్రంలోనే ఏకంగా సీఎంలను ఓడించిన చరిత్ర ఇద్దరిదీ.. 

మద్దతులోనూ అలాగే జరతుంది :

2013 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మెజార్టీకి కావాల్సిన సీట్ల మద్దతును కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మద్దతుతోనే అప్పట్లో కేజ్రీవాల్ ఫస్ట్ టైం సీఎం అయ్యారు.  తమిళనాడులోనూ ఇప్పుడే ఇలాగే జరుగుతుంది. టీవీకే పార్టీకి కావాల్సిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతులో భాగంగా.. కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వబోతుంది. సీపీఐ, సీపీఎం చెరో 2 సీట్లు అంటే నలుగురు ఎమ్మెల్యేల మద్దతుకు సిద్ధంగా ఉన్నారు. వీసీకే పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

చూడండీ.. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావటానికి.. కేజ్రీవాల్ సీఎం కావటానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ సీఎం సీట్లో కూర్చోవటానికి కాంగ్రెస్ పార్టీనే మద్దతు ఇస్తుంది. 

ఇద్దరికీ వారసత్వం లేదు :
కేజ్రీవాల్ కు, విజయ్ కు రాజకీయ వారసత్వం లేదు. ఇద్దరూ ఫస్ట్ టైం పార్టీ పెట్టారు.. ఇద్దరూ ఒంటరిగానే పోటీ చేశారు.. ఇద్దరి కుటుంబాల్లోనూ రాజకీయ అనుభవం  ఎవరికీ లేదు. పార్టీ పెట్టారు.. పోటీ చేశారు.. గెలిచారు.. సేమ్ టూ సేమ్ అప్పట్లో కేజ్రీవాల్ విషయంలో ఎలా జరిగిందో.. ఇప్పుడు విజయ్ విషయంలోనూ అలాగే జరిగింది. 

యువత.. జెన్ జెడ్ ఓట్లే ఇద్దరికీ :
అప్పట్లో కేజ్రీవాల్ వెంట ఉన్నది యువతనే. యువ నాయకత్వమే. యువతే గెలిపించింది. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అంశాలపై పోరాటమే కేజ్రీవాల్ ను గెలిపించాయి. ఇప్పుడు తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీని గెలిపించింది యువతనే. జెన్ జెడ్ కుర్రోళ్లే. విజయ్ ఎన్నికల ప్రచార అంశాలు అవినీతి, కుటుంబ పాలనపైనే సాగాయి. 
అప్పట్లో కేజ్రీవాల్ కు ఇదే కలిసొచ్చింది.. ఇప్పుడు విజయ్ కు అదే కలిసొచ్చింది.  కాలం మారినా అంశాలు అవే కావటం.. సీట్లు, ఓట్లు, మద్దతు అలాగే ఉండటం యాదృశ్చికం కదా..  ఇప్పుడు అందరూ ఇలాగే అంటున్నారు.. సేమ్ టూ సేమ్.. అప్పట్లో కేజ్రీవాల్. ఇప్పుడు విజయ్.. సీట్లు, ఓట్లు, మద్దతు అలాగే అని.. 2013 ఢిల్లీ పొలిటికల్ హిస్టరీ.. 2026లో తమిళనాడులో రిపీట్ అయ్యిందా అని..