ఇదొక న్యూ ఎక్స్‌‌పీరియెన్స్ : అడవి శేషు

 ఇదొక న్యూ ఎక్స్‌‌పీరియెన్స్ : అడవి శేషు

‘‘హిట్‌‌ 2’లో నటించడానికి మొదట ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌‌లో విశ్వక్‌‌ నటించాడు. నేను చేయడమంటే తన నుండి లాక్కున్నట్టుగా ఉంటుందనుకున్నా. కానీ దీన్ని ఒక ఫ్రాంచైజీగా మారుస్తున్నామని మొత్తం ఏడు భాగాలుగా తీస్తామని చెప్పడంతో ఓకే చెప్పాను. ఫస్ట్ పార్ట్‌‌కు దీనికి చిన్న చిన్న కనెక్షన్స్ ఉంటాయి. అది చూడకపోయినా ఇది నచ్చుతుంది. చూస్తే ఎక్కువ నచ్చుతుంది. ఒక చిన్న ఊళ్లో చిల్లర దొంగతనాలు తప్ప నేరాలేమీ జరగవు అనుకుంటాడు హీరో. అందుకే  లైఫ్‌‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ హఠాత్తుగా ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు కథ. 

ఫస్టాఫ్, సెకెండాఫ్ అని సినిమాను విడివిడిగా జడ్జ్ చేస్తుంటాం. కానీ ఇంటర్వెల్‌‌తో సంబంధం లేకుండా  జడ్జ్ చేయాల్సిన సినిమా ఇది.  కచ్చితంగా బిగ్గర్ అండ్ బెటర్ ఫిల్మ్ అవుతుంది. నా గత చిత్రాల స్క్రిప్ట్‌‌లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఇందులో రైటింగ్ సైడ్ నా ఇన్వాల్వ్‌‌ మెంట్ లేదు. నాకిది న్యూ ఎక్స్‌‌పీరియెన్స్. ‘మేజర్‌‌‌‌’ చివరి షెడ్యూల్‌‌ టైమ్‌‌లో ఇది మొదలైంది కనుక ఫిజికల్‌‌ ఫిట్‌‌నెస్ విషయంలో రెడీగా ఉన్నాను. క్లైమాక్స్‌‌లో కొత్త శేష్‌‌ కనిపించడంతో పాటు థర్డ్ పార్ట్‌‌ హీరో కూడా కనిపిస్తాడు.  హిందీలోనూ డిసెంబర్‌‌‌‌ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే కన్నడ లోనూ రిలీజ్ చేస్తాం. 

ఏడాదిలో నేను నటించిన రెండు సినిమాలు విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్.  త్వరలో ఓ ఆస్కార్ విన్నింగ్ మూవీ రీమేక్‌‌లో నటించ బోతున్నా. ఒరిజినల్ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌‌ ఇక్కడి సంస్థతో కలిసి నిర్మించబోతోంది. నా ఫ్రెండ్స్‌‌లో ఒకరు డైరెక్ట్ చేయబోతు న్నారు. ఇందులో పూర్తిస్థాయి రఫ్‌‌ క్యారెక్టర్‌‌‌‌ చేయబోతున్నా. ఇక ‘గూడచారి 2’ బేస్ స్టోరీ ఇప్పటికే సిద్ధమైంది. స్క్రీన్‌‌ప్లే పూర్తి కావాల్సి ఉంది’’.