చిన్నారిని చిదిమేసిన కారు.. బైక్ పై ఢీ కొట్టిన కారు

చిన్నారిని చిదిమేసిన కారు.. బైక్ పై ఢీ కొట్టిన కారు
  •  బైక్​పై బాబును తీసుకెళ్తుండగా ఢీకొట్టిన కారు
  • విద్యార్థి మృతి, తండ్రికి తీవ్ర గాయాలు
  •  హైదరాబాద్ ఇబ్రహీంబాగ్​ వద్ద ఘటన

మెహిదీపట్నం, వెలుగు:  వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో కొడుకు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇబ్రహీం బాగ్ ప్రాంతానికి చెందిన రమేష్  ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. శనివారం తన కొడుకును పక్కనే ఉన్న వైఎస్సార్ కాలనీలోని అమ్మమ్మ ఇంటి వద్ద వదిలి పెట్టేందుకు బైక్​పై బయలుదేరాడు. ఈ క్రమంలోనే వారికి ఎదురుగా వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీట్టింది. 

ఈ సంఘటనలో  రమేశ్​తో పాటు కొడుకు సూర్య (7)కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకటవ తరగతి చదువుతున్న సూర్య మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారు డ్రైవర్ శ్రీనాథ్ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కారులో శ్రీనాథ్ తో పాటు మరికొందరు ఉండగా వారు మద్యం సేవించారని స్థానికులు పేర్కొన్నారు.