HIT 3 Box Office: అఫీషియల్.. బాక్సాఫీస్పై సర్కార్ వేట.. హిట్ 3 రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

HIT 3 Box Office: అఫీషియల్.. బాక్సాఫీస్పై సర్కార్ వేట..  హిట్ 3 రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే?

హిట్ ది థర్డ్ కేస్ ఫుల్ వైలెన్స్ మోడ్ లో థియేటర్లలలో రన్ అవుతుంది. వీకెండ్ ఆడియన్స్ ఎగబడి సినిమా చూడటానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే హిట్ 3 ఫస్ట్ డే ఓపెనింగ్స్ కుమ్మేసాయి. తొలిరోజు (మే1) ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ ఓపెనింగ్  సాధించింది. రెండోరోజు (మే2) కూడా తగ్గేదేలే అనేలా వసూళ్లు చేసింది. 

లేటెస్ట్గా హిట్ 3 రెండో రోజు బాక్సాఫీస్ వసూళ్లు ప్రకటించారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా హిట్ 3 మూవీ రెండ్రోజుల్లో రూ.62కోట్లకి పైగా వసూలు సాధించినట్లు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. "ఇది బాక్సాఫీస్ వద్ద సర్కార్ వేట.. HIT3 మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.62కోట్లకి పైగా కలెక్షన్స్.. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి" అంటూ మేకర్స్ తెలిపారు.

ఇకపోతే.. హిట్ 3 రెండవ రోజు ఇండియాలో రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. (తెలుగురూ.9.7కోట్లు; తమిళంలో రూ.1 లక్ష: హిందీలో రూ.2లక్షలు).

అలాగే, ఫస్ట్ డే ఇండియాలో రూ.19 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. తెలుగులో రూ.18.25 కోట్లు, తమిళంలో రూ.35 లక్షలు, కన్నడలో రూ.5 లక్షలు, హిందీలో రూ.25 లక్షలు మరియు మలయాళంలో రూ.1 లక్ష మాత్రమే సంపాదించింది. దీంతో రెండు రోజుల కలెక్షన్స్ రూ.31 కోట్లకు చేరింది.

ఓవర్సీస్ లోనూ హిట్ 3 వసూళ్ల సునామీతో క్రియేట్ చేస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలోనే $1.5 మిలియన్స్ కి పైగా వసూళ్లు చేసింది. ఇక నేటి నుంచి మొదలయ్యేది వీకెండ్ కాబట్టి శని, ఆదివారాల్లో హిట్ 3 మూవీ కలెక్షన్లు అమాంతం పెరిగే అవకాశముంది.

హిట్ 3 మూవీలో అర్జున్ సర్కార్ ఐపీఎస్గా నాని తన విశ్వరూపం చూపించారు. నాని కెరియర్లోనే మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ యాక్షన్ తో ఇరగదీశాడు. సినిమా మొత్తం తన వైలెంట్ క్రైమ్ తో స్క్రీన్ పై ఇంటెన్సివ్ యాంగిల్ ప్రదర్శించాడు. ఈ అంశాలతో నాని ఖాతాలో వైల్డ్ ఫ్యాన్స్ కూడా చేరిపోయారు.