రికార్డ్ బ్రేక్: టీ20ల్లో నంబర్-1 రోహిత్

రికార్డ్ బ్రేక్: టీ20ల్లో నంబర్-1 రోహిత్

అక్లాండ్ : న్యూజిలాండ్ గడ్డమీద అరుదైన ఘనత రికార్డును అందుకున్నారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. న్యూజిలాండ్ క్రికెటర్ పేరు మీదున్న రికార్డున్న బ్రేక్ చేశాడు. శుక్రవారం జరిగిన సెకండ్ టీ20లో రోహిత్ హాఫ్ సెంచరీ చేయడంతో ..టీ20ల్లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ కే చెందిన మార్టిన్ గుప్టిల్ ను అధిగమించి 36 రన్స్ ఎక్కువతో టాప్ లో నిలిచాడు రోహిత్. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌ లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మన్‌ గా నిలిచాడు.

ఇప్పటివరకు రోహిత్ 92 టీ20ల్లో మొత్తం 2వేల288 రన్స్ చేశాడు. అందులో మొత్తం 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ కు ముందు ఈ లిస్ట్‌ లో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో గప్టిల్ (2272), షోయబ్ మాలిక్ (2263) ఉన్నారు. అయితే హాఫ్ సెంచరీతో ఆ ఇద్దరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. రెండో టీ20 మ్యాచ్‌ లో రోహిత్ 29 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 50 రన్స్ చేసి ఔటయ్యాడు.