
- స్టూడెంట్లతో టాయిలెట్ క్లీనింగ్
- హెచ్ఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు
- తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఘటన
చెన్నై: స్కూలు ఆవరణలోని టాయిలెట్‌ను స్టూడెంట్లతో కడిగించిందో లేడీ హెచ్ఎం.. షెడ్యూల్ కులాలకు చెందిన స్టూడెంట్లకు ప్రత్యేకంగా ఎంపిక చేసి మరీ రోజూ క్లీన్ చేయించింది. టాయిలెట్‌లోని దోమలు కుట్టడంతో ఓ స్టూడెంట్‌కు డెంగ్యూ సోకి ఆస్పత్రి పాలవడంతో క్లీనింగ్విషయం బయటపడింది. దీనిపై స్టూడెంట్ తల్లి ఫిర్యాదు చేయడంతో హెచ్ఎంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిల్లాలోని పాలకరాయ్ పంచాయత్ యూనియన్ స్కూల్ లో హెచ్ఎం గీతారాణి షెడ్యూల్ కులాలకు చెందిన ఆరుగురు స్టూడెంట్లతో టాయిలెట్లు క్లీన్ చేయించారు. ఒక స్టూడెంట్ డెంగ్యూతో ఆస్పత్రిపాలయ్యాడు.
తల్లి ఆరా తీయడంతో స్కూల్లో టాయిలెట్ క్లీనింగ్ విషయాన్ని పిల్లాడు బయటపెట్టాడు. క్లాస్‌లో 40 మంది స్టూడెంట్లు ఉన్నప్పటికీ హెచ్ఎం తమతోనే క్లీనింగ్ చేయిస్తుందని వాపోయాడు. దీంతో షెడ్యూల్ కులాలకు చెందిన తమ పిల్లాడిపై వివక్ష చూపిస్తోందని హెచ్ఎంపై స్టూడెంట్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ హెచ్ఎంపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంకింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ హెచ్ఎం పరారీలో ఉన్నారని, ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు.