
హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో అనధికార లే అవుట్లలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిషేధించినట్లు కొన్ని మీడియా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై హెచ్ఎండీఏ క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని తెలిపింది. దీనికి సంబంధించి గత సంవత్సరకాలంగా, హెచ్‌ఎండీఏ నుండి రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదు.
గ్రామ పంచాయతీల్లో అనధికారిక లే అవుట్‌ల ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవాలు. ఇలాంటి నిరాధారమైన, సత్యదూరమైన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీడియా సంస్థలు దీనిని గమనించాల్సిందిగా కోరుతున్నాం. అని హెచ్ఎండీఏ తన ఎక్స్ లో ట్వీట్ చేసింది.
గత కొన్ని రోజులుగా హైదాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో గ్రేటర్ శివారులో అక్రమంగా నిర్మించిన ప్లాట్లను హైడ్రా కూల్చేసింది. దీంతో నగర శివారులోని గ్రామాపంచాయతీలో అనధికార లే అవుట్ల ప్లాట్ ల రిజిస్ట్రేషన్లను బ్యాన్ చేసినట్లు కొన్ని ఛానెళ్లలో ప్రచారం జరిగింది. అందుకే హెచ్ఎండీఏ వెంటనే దీనిపై స్పందించి అవన్నీ ఫేక్ వార్తలు అని క్లారిటీ ఇచ్చింది.