కోకాపేట భూములకు కాసుల పంట..హెచ్ఎండీఏకు రూ. 3,700 కోట్ల ఆదాయం

కోకాపేట భూములకు కాసుల పంట..హెచ్ఎండీఏకు రూ. 3,700 కోట్ల ఆదాయం

కోకాపేట నియోపోలీస్ భూములకు  మూడో విడత భూముల వేలం ముగిసింది.  డిసెంబర్ 3న  ప్లాట్ నంబర్స్ 19,20 లోని 8.04 ఎకరాలకు ఈ వేలం వేశారు అధికారులు.  ప్లాట్ నెంబర్ 19 లో ఎకరానికి రూ.131 కోట్లు పలకగా.. ప్లాట్ నెంబర్ 20 లో ఎకరానికి రూ. 118 కోట్లు పలికింది . మొత్తం ఇవాళ 8.04 ఎకరాలకు  వేలం వేయగా హెచ్ఎండీఏకు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది.  

మొత్తం మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు హెచ్ఎండీఏకు 3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో ఈ వేలం వేయనుంది హెచ్ఎండీఏ. కోకాపేట లోని 29 ఎకరాలు, మూసాపేట లోని 15 ఎకరాల భూమికి వేలం వేయనుంది.  కోకాపేట గోల్డెన్ మైల్ లోని 2 ఎకరాలు, మూసాపేట లోని 15 ఎకరాలకు డిసెంబర్ 5న ఈ వేలం వేయనుంది హెచ్ఎండీఏ.

కోకాపేటలోని నియోపోలిస్​ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఆకాశమే హద్దుగా ఎన్ని ఫ్లోర్లయినా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తారు. ఈ లేఅవుట్లో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. దాదాపు 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్​ట్రాక్స్​, 45 మీ. వెడల్పైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్​ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్​టైన్​మెంట్ల అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు.