వారంలోగా ఖాళీ చేయండి

వారంలోగా  ఖాళీ చేయండి

‘హెర్మిటేజ్’లోని ప్రభుత్వ
ఆఫీసులకు హెచ్ఎండీఏ నోటీసులు

అసెంబ్లీ సమీపంలోని హెర్మిటేజ్ భవనంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను 7 రోజుల్లోగా ఖాళీ చేయాలని హెచ్ఎండీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ భవానాన్ని ఏపీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకే నోటీసులు జారీ చేశామని చెప్పారు. గురు వారం హెర్మిటేజ్ భవనాన్ని సీఎస్ జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. సమయం తక్కువ ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయమని వారికి చెప్పినట్లు తెలుస్తోంది.

ఖాళీ ఆఫీసుల కోసం వెతుకులాట
రాష్ట్ర ఆహార కమిషన్, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ, సెర్ప్ కార్యాలయాలు.. శ్రీనిధి బ్యాంక్ , ఏఐసీటీఈ ఆఫీసులు తదితరాలు హెర్మిటేజ్ బిల్డింగ్​లో ఉన్నాయి. 7 రోజుల్లోగా ఖాళీ చేయాలని చెప్పటంతో ఇక్కడి అధికారులు హైదరాబాద్​లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఆఫీసుల కోసం అన్వేషిస్తున్నారు. మాసబ్ ట్యాంక్ లోని సీఐడీ కార్యాలయాన్ని కూడా ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది.