
హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాకు రెండు రోజుల పాటు అంతరాయం ఏర్పడనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ హెచ్చరించింది. ప్రధానంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ ఫైజ్ 1 ప్రాజెక్టులో జరుగుతున్న కొన్ని మరమ్మత్తులే దీనికి కారణంగా బోర్డ్ వెల్లడించింది. సెప్టెంబర్ 9 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 10 ఉదయం 11 గంటల వరకు పంపింగ్ స్టేషన్లలో డయామీటర్ వాల్వ్స్ మార్పుకు సంబంధించిన పనులు జరుగుతాయని వాటర్ బోర్డ్ హెచ్చరించింది.
ఈ మెయింటెనెన్స్ వర్క్ కారణంగా ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారా హిల్స్, వెంగళరావ్ నగర్, ఎల్లమ్మబండ, ఎల్లారెడ్డిగూడ, సోమాజీగూడ, ఫతేనగర్, జూబ్లిహిల్స్, లాలాపేట్, తార్నాకా, తాటికానా, కూకట్ పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, మూసాపేట్, భరత్నగర్, మోతీనగర్, గాయత్రీనగర్, బాబానగర్, కేపీహెచ్బీ, బాలాజీనగర్, హస్మత్పేట్ ప్రాంతాల్లో నీటి సేవల్లో అంతరాయం ఉండనుంది.
దీనికి తోడు చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, జగత్గిరిగట్ట, ఆదర్షనగర్, సురారం, అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మంచబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్పేయి నగర్, యాప్రాల్, చాణుక్యపురి, గౌతమ్ నగర్, సాయినాధపురం, మౌలాలీ, చర్లపల్లి, రాథిక సెక్షన్, కైలాసగిరి, మల్లాపూర్, కొండాపూర్, డోన్స్, మాధాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల, హఫీజ్ పేట్, మియాపూర్, పోచారం, కోంపల్లి, గండ్లపోచారం, తుమకూర్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం సెక్షన్, అయ్యప్ప కాలనీరిజర్వాయర్ ఏరియాల్లో కూడా వాటర్ సప్లై నిలిపోతుంది.
ALSO READ : ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర
ఇక చివరిగా నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపుర్, బొల్లారం, బౌరంపేట్ సెక్షన్, త్రిసూల్ లైన్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోర్న్మెంట్, ఏయిమ్స్ బిబినగర్, మెడ్చల్, షామీర్ పేట్ ప్రాంతాల్లో కూడా నీటి సమస్యలు ఉన్నందున ప్రజలు వీటిని గమనించి ప్లాన్ చేసుకోవాలని, నీటిని వృధా చేయెుద్దని ప్రజలకు HMWSSB అధికారులు సూచిస్తు్న్నారు.