బేగంపేట ఎయిర్​పోర్టుకు బాంబు బెదిరింపు

బేగంపేట ఎయిర్​పోర్టుకు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్, వెలుగు: బేగంపేట ఎయిర్​పోర్టుకు సోమవారం బాంబు​బెదిరింపు మెయిల్​వచ్చింది. అప్రమత్తమైన అధికారులు పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుర్తుతెలియని ఆకతాయిలు  కావాలనే బాంబు పెట్టినట్లు మెయిల్​చేశారని పోలీసులు వెల్లడించారు. 

గత వారంలో ఇలాగే బాంబు బెదిరింపు  మెయిల్ రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజాగా మరోసారి మెయిల్ రావడంతో ఎయిర్​పోర్టులో  భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే మెయిల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.