
టీమిండియాతో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో గెలిచి ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియాపై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బర్మింగ్ హోమ్ వేదికగా ఎడ్జ్‌బాస్టన్ లో బుధవారం (జూలై 2) భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ 11 ప్రకటించింది. స్క్వాడ్ లో కొత్తగా ఫాస్ట్ బౌలర్ ను ఆర్చర్ ను చేర్చిన అతనికి తుది జట్టులో స్థానం కల్పించలేదు. తొలి టెస్ట్ ఆడిన తుది జట్టుతోనే ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ప్లేయింగ్ 11 లో 5 గురు బ్యాటర్లు.. ఒక వికెట్ కీపర్.. ఒక ఆల్ రౌండర్.. ముగ్గురు స్పెషలిస్ట్ సీమర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలీ ఆడనున్నారు. మూడో స్థానంలో పోప్ బ్యాటింగ్ చేస్తాడు. సీనియర్ బ్యాటర్ జో రూట్, యువ సంచలనం హ్యారీ బ్రూక్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. కెప్టెన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
►ALSO READ | ENG vs IND 2025: జరిగిన నష్టం చాలు.. జైశ్వాల్‌ను పక్కన పెట్టిన టీమిండియా
సూపర్ ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ ఏడో స్థానంలో ఆడతాడు. సీనియర్ బౌలర్ క్రిస్ వోక్స్, జోష్ టంగ్,బ్రైడాన్ కార్సే ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా షోయబ్ బషీర్ కు తుది జట్టులో స్థానం దక్కింది. యువ బ్యాటర్ బెథెల్‌తో పాటు, సామ్ కుక్, జామీ ఓవర్టన్ లకు రెండో టెస్టులోనూ బెంచ్ కు పరిమితమయ్యారు. గస్ అట్కిన్సన్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. మూడో టెస్ట్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. స్క్వాడ్ లో ఎంపికైనా వ్యక్తిగత కారణాల వలన ఆర్చర్ రెండో టెస్ట్ ఆడడం లేదని తెలుస్తుంది.
టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:
బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్
ENGLAND 11 FOR THE SECOND TEST:
— Johns. (@CricCrazyJohns) June 30, 2025
Crawley, Duckett, Pope, Root, Brook, Stokes (C), Jamie Smith (WK), Woakes, Carse, Tongue and Bashir. pic.twitter.com/Yn4vnj248r