గాజాస్కూళ్లపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి..95 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాస్కూళ్లపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి..95 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. మంగళవారం (జూలై1) గాజాలోని కేఫ్, పాఠశాల, శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు జరిగాయి. జరిపిన దాడుల్లో 95మంది పాలస్తీనియన్లు చనిపోయారు.ఈ దాడుల్లో పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాలలు, కేఫ్​లు, ఆహార పంపిణీ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. 

గాజాపై ఇజ్రాయెల్​ జరిపిన దాడుల్లో 95 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో చాలా మంది సాధారణ పౌరులు ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉన్నారు. ఉత్తర గాజాలోని అల్-బఖా కెఫెటేరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 39 మంది మృతిచెందారు. డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు.మృతుల్లో ఓ జర్నలిస్ట్ ఇస్మాయిల్, మహిళలు, పిల్లలు ఉన్నారు.ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఈ దాడి చేశాయి. ఈ బాంబు దాడిలో కేఫ్ నేలమట్టమైంది.భూమిలో పెద్ద గొయ్యి ఏర్పడింది.

►ALSO READ | ఎలాన్ మస్క్‌కి ట్రంప్ వార్నింగ్.. దెబ్బకి సౌత్ ఆఫ్రికా తిరిగి పారిపోతావ్ అంటూ సీరియస్

సోమవారం కూడా ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలోని జీటౌన్ పరిసరాల్లో దాడులు చేశారు. శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్​ వైమానిక దాడి చేయగా 13 మందిని చనిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోని యాఫా పాఠశాలపై కూడా బాంబు దాడి చేసింది. ఇది వందలాది మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తోంది.
మధ్య గాజాలోని ఓ ఆస్పత్రిపై కూడా ఇజ్రాయెల్​ దళాలు విరుచుకుపడ్డాయి. వేలాది కుటుంబాలు ఆశ్రయం పొందిన దేయిర్​ ఎల్​ బలాలోని అల్​ అక్సా ఆస్పత్రి ప్రాంగణంపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి.

ఇజ్రాయెల్ వాదన:

ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్​ సైన్యం తెలిపింది. పౌరులు ఉన్న ప్రాంతాల నుండి హమాస్ పనిచేస్తోందని అందువల్ల ప్రజల మరణాలకు హమాస్ కారణమని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. దాడులు చేసే ముందు పౌరులను హెచ్చరిస్తున్నామని ఇజ్రాయెల్​ తెలిపింది. 

అంతర్జాతీయ స్పందన:

ఈ దాడులపై  ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర పౌర ఆశ్రయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని మానవ హక్కుల సంస్థలు ,ఐక్యరాజ్యసమితి చెబుతున్నాయి. ఈ సంఘటనలు గాజాలో నెలకొన్న తీవ్ర మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయంటున్నారు.