
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభంగా జరిగింది. జూలై 1న ఉదయం 11:51 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి పెళ్లి జరిపారు. అమ్మవారి కల్యాణానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.
ఎల్లమ్మ కల్యాణానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా హాజరయ్యారు.ఎల్లమ్మ తల్లి దేవస్థానం. అమ్మవారి గర్భాలయాన్ని ప్రత్యేకంగా అలకంరించారు ఆలయ అధికారులు.
రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, రథోత్సవం సందర్భంగా జులై 2 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్‌డేవిస్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్‌ఆర్ నగర్ టీ- జంక్షన్ నుంచి మళ్లించి.. ఎస్‌ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ క్రాస్ రోడ్డు, శ్రీరామ్ నగర్, సనత్‌నగర్ మీదుగా ఫతేనగర్ వైపు అనుమతిస్తారు.