
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లకు అడిక్ట్ అవ్వడం కామనే. కాలేజీలు, ఆఫీసులు, ఇల్లు అనే తేడాల్లేకుండా ఏ పనులు చేస్తున్నా మొబైల్స్‌ను పదేపదే చెక్ చేస్తూ ఉండేవారిని చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడో వ్యక్తి శోభనం రోజున, భార్య మంచం మీద ఉండగా కంప్యూటర్‌ను చూస్తూ కూర్చోవడం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. నూతన వధూవరులు పెళ్లి బట్టల్లో ఉండటాన్ని దీంట్లో గమనించొచ్చు. అలాగే వధువు బెడ్ మీద ఎదురు చూస్తూ కూర్చోవడాన్ని కూడా చూడొచ్చు. ఇది కావాలని తీసినా ఫొటోనా లేదో తెలియరాలేదు. వరుడు కంప్యూటర్‌లో ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉన్నాడా లేదా ఇంకేమైనా చేస్తున్నాడా అనే దాని పైనా క్లారిటీ లేదు. కానీ ఈ ఫొటోపై రకరకాల మీమ్స్ నెట్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.