హోలీ సంబరాలు షురూ.. హైదరాబాద్లో ఫుల్ జోష్..

హోలీ సంబరాలు షురూ.. హైదరాబాద్లో ఫుల్ జోష్..

సంతోషాల కేళి.. సంబరాల హోలీ.. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పల్లెల నుంచి పట్టణాలదాకా ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ.. ఏంతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం జీవితాల్లో సంతోషాన్ని నింపడం. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా, పేద.. ధనిక తేడా లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. 

సహజ రంగులతో హోలీ ఆడటం మంచిది. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని కెమికల్ రంగులతో ఆడకుండా సహజ రంగులతో ఆడకుండా సేంద్రీయ రంగులతో హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచే హోలీ సంబరాలు మొదలైయ్యాయి. యూత్ మొత్తం ఆటపాటలతో హోలీని జరుపుకుంటున్నారు. రంగుల హరివిల్లులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో కలసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుని, డ్యాన్స్ లు చూస్తూ.. సెల్ఫీస్ తీసుకుంటున్నారు.