హైకోర్టుకు హోలీ సెలవులు

 హైకోర్టుకు హోలీ సెలవులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర హైకోర్టుకు ఈ నెల 7, 8న హోలీ సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి 9(గురువారం) నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. హైకోర్టుతో పాటు స్టేట్‌‌‌‌‌‌‌‌ జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌ అకాడమి, స్టేట్‌‌‌‌‌‌‌‌ లీగల్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ అథారిటీ, లీగల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ కమిటీలకు కూడా సెలవులు వర్తిస్తాయి. ఇందుకు ప్రతిగా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 2న శనివారం హైకోర్టు పనిచేస్తుందని రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌  పేర్కొన్నారు.